Business

#
Type Here to Get Search Results !

Union Bank of India నుండి ఉద్యోగ ప్రకటన

 Union Bank of India నుండి ఉద్యోగ ప్రకటన:
స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు:అర్హతలు ఇవ్వే......!!!!

డిగ్రీ పూర్తి చేసి నిరుద్యోగిగా మిగిలిపోయా రా బ్యాంకులో ఉద్యోగం చేయాలని ఆశ నీకు ఉందా... అయితే మీలాంటి వారికోసమే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తం 347 పోస్టులను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భర్తీ చేయనుంది



ఇక పూర్తి వివరాలు లేట్ చెయ్యకుండా తెలుసుకుందాం



ప్రముఖ జాతీయ బ్యాంక్ అయిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీగా ఉద్యోగాలు చేపట్టేందుకు ప్రక్రియ మొదలు పెట్టింది ఇందులో భాగంగా 347 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది స్పెషలిస్ట్ ఆఫీసర్ కేడర్ లో భాగంగా అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో స్పష్టంగా తెలియజేసింది. అదే విధంగా ఈ పోస్టులన్నీ పర్మినెంట్ పోస్టులను కూడా పేర్కొనడం జరిగింది.


స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల లో భాగంగా పోస్టులను విభజించి చూస్తే


👉సీనియర్ మేనేజర్ 60 పోస్టులు,


👉 మేనేజర్ 60 పోస్టులు,


👉మేనేజర్ (సివిల్ ఇంజనీర్) 07పోస్టులు,


👉మేనేజర్  (ఆర్కిటెక్ట్) 07 పోస్టులు,


👉మేనేజర్ (ఎలక్ట్రికల్ ఇంజనీర్) 02 పోస్టులు,


👉మేనేజర్ (ప్రింటిగ్ టెక్నాలజీస్ట్) 01 పోస్టులు,


👉మేనేజర్ (ఫారెక్స్) 50 పోస్టులు,


👉మేనేజర్ (ఛార్టర్డ్ అకౌంటెంట్) 14 పోస్టులు,


👉 అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్ ఆఫసర్) 25 పోస్టులు,


👉 అసిస్టెంట్ మేనేజర్ (ఫారెక్స్) 120 పోస్టులను భర్తీ చేయనుంది.

విద్యార్హతల విషయానికొస్తే ఆయా పోస్టులకు సంబంధించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఆ బ్రాంచ్లో డిగ్రీ పీజీ ఉండాలి పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ చూడగలరు ఇక అభ్యర్థుల వయసు విషయానికొస్తే సీనియర్ మేనేజర్ రిస్కు కు అప్లై చేసే వారి వయసు 30 ఏళ్ల నుంచి 40 ఏళ్లుగా నిర్ణయించారు. మిగితా అన్ని పోస్టులకు 25 ఏళ్ల నుంచి 35 ఏళ్లుగా నిర్ణయించడం జరిగింది ఇక అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్ ఆఫీసర్)అసిస్టెంట్ మేనేజర్ (ఫోరెక్స్) పోస్టుల అభ్యర్థుల వయసు 20 ఏళ్ల నుంచి 30 ఏళ్లుగా నిర్ణయించారు.



అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఆన్లైన్ పరీక్ష ద్వారా ఉంటుంది ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు గ్రూప్ డిస్కషన్ ఆతర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ క్లియర్ చేయాల్సి ఉంటుంది యూనియన్ బ్యాంకులో స్పెషలిస్ట్ ఉద్యోగులకు అప్లై చేస్తున్నా వారు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబిసి అభ్యర్థులు 850 రూపాయలు అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ మరియు దివ్యాంగులు అప్లికేషన్ ఫీజు నుంచి మినహాయింపు పొందవచ్చు.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ ముఖ్యమైన తేదీలు ఈ విధంగా ఉన్నాయి.

👉 నోటిఫికేషన్ విడుదల తేదీ 12 ఆగస్టు 2021


👉 ఆన్లైన్ ద్వారా దరఖాస్తు ప్రారంభం తేదీ 12 ఆగస్టు 2021


👉 ఆన్లైన్ అప్లికేషన్ పూర్తి చేసేందుకు చివరి తేదీ 3 సెప్టెంబర్ 2021


ఇక వేతనం విషయానికొస్తే



👉సీనియర్ మేనేజర్ (రిస్కు) 63840-1990/5-73790-220/2-78230(MMGS-II)


👉మేనేజర్ (రిస్క్) 48170-1740/1-49910-1990/10-69810 MMGS-II


👉 మేనేజర్ (సివిల్ ఇంజనీర్)48170-1740/1-49910-1990/10-69810(MMGS-II)


👉మేనేజర్ (ఆర్కిటెక్ట్)

48170-1740/1-49910-1990/10-69810(MMGS-II)


👉మేనేజర్ (ఎలక్ట్రికల్ ఇంజినీర్) 48170-1740/1-49910-1990/10-69810(MMGS-II)


👉మేనేజర్ (ప్రింటింగ్ టెక్నాలజీస్ట్)48170-1740/1-49910-1990/10-69810(MMGS-II)


👉మేనేజర్ ( ఫోరేక్స్) 48170-1740/1-49910-1990/10-69810(MMGS-II)


👉మేనేజర్ (చార్టెడ్ అకౌంటెంట్) 48170-1740/1-49910-1990/10-69810(MMGS-II)



👉అసిస్టెంట్ మేనేజర్ ( టెక్నికల్ ఆఫీసర్) 36000-1490/7-46430-1740/2-49910-1990/7-63840(JMGS-I)


👉 అసిస్టెంట్ మేనేజర్ (ఫోరెక్స్) 36000-1490/7-46430-1740/2-49910-1990/7-63840(JMGS-I)

ఇక మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్ సైట్ లోని రిక్రూట్మెంట్ సెక్షన్ ను సందర్శించగలరు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.