Business

#
Type Here to Get Search Results !

టెన్త్‌ పాసైన వారికి పోస్టల్‌ శాఖలో 2357 జాబ్స్‌.. ఎలా అప్లయ్ చేయాలి చూడండి...

India Post 2357 GDS Jobs: ఈ మొత్తం గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల్లో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ వంటి ఉద్యోగాలు ఉన్నాయి.

ప్రధానాంశాలు:

  • పోస్టల్‌ శాఖ జాబ్‌ నోటిఫికేషన్‌
  • 2357 గ్రామీణ డాక్‌ సేవక్‌ పోస్టుల భర్తీ
  • పశ్చిమ బెంగాల్ పోస్టల్ సర్కిల్స్ లో ఖాళీలు
  • ఆగస్టు 19 దరఖాస్తులకు చివరితేది
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. గ్రామీణ డాక్ సేవక్ (Gramin Dak Sevak- GDS) ఉద్యోగాల భర్తీకి సంబంధించి భారత పోస్టల్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రామంలోనే ఉంటూ ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకునేవారికి ఇది మంచి అవకాశం. మంచి జీతంతో పాటు ఇంటి వద్దే పని చేసుకోవచ్చు. అయితే.. ఈ జీడీఎస్‌ పోస్టులు పశ్చిమ బెంగాల్ పోస్టల్ సర్కిల్స్ లో అందుబాటులో ఉన్నాయి.

ఈ నోటిఫికేషన్‌ ద్వారా 2357 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల్లో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ వంటి ఉద్యోగాలు ఉన్నాయి. బ్రాంచ్ మాస్టర్ పోస్టుకు రూ.12,000లు కాగా.. మిగిలిన పోస్టులకు రూ.10,000 వేతనం అందుకోవచ్చు.10వ, 12వ తరగతి లేదా అంతకంటే పై విద్యా స్థాయిల్లో కంప్యూటర్ సబ్జెక్టుగా ఉన్న అభ్యర్థులకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ పై ఇచ్చే సర్టిఫికేట్ అవసరం లేదు. ఇది వారికి ఆప్షనల్ మాత్రమేని నోటిఫికేషన్ లో పొందుపరిచారు. అంతేకాకుండా దరఖాస్తుదారులు తప్పనిసరిగా 10వ తరగతిలో గణితం, స్థానిక భాష, ఆంగ్లం సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులై ఉండాలి. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం, విశ్వవిద్యాలయం, బోర్డులు లేదా ప్రైవేటు సంస్థలు నిర్వహించే కంప్యూటర్ ట్రైనింగ్ కోర్సు సర్టిఫికేట్ ను కలిగి ఉండాలి. లేదా కనీసం 60 రోజుల శిక్షణ కోర్సును కలిగి ఉండే బేసిక్ కంప్యూటర్ కోర్సుకు సంబంధించిన ధ్రువపత్రం సమర్పించాలి

ఇక ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థలకు మూడు సంవత్సరాలు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్ ఫీజుగా రూ.100లు చెల్లించాలి. మహిళలకు, ట్రాన్స్ మహిళా అభ్యర్థులకు, SC, ST, PWD అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆగస్టు 19, 2021 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థలు https://appost.in/ వెబ్ సైట్ ద్వారా పూర్తి సమాచారం తెలుసుకోవడంతో పాటు ఇదే వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.